రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు… ఎన్నికల సంఘం క్లారిటీ!

-

తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డు జారీపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎన్నికల సంఘం. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించింది.

The Election Commission has responded to the Telangana state ration card issue

ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ ఇచ్చింది ఎన్నికల సంఘం. మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని అందులో నిజం లేదని తెలిపింది. ఇటు మీసేవ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది పౌరసరఫరాల శాఖ. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే మీసేవను కోరామని వివరించింది పౌరసరఫరాల శాఖ. మార్పులు, చేర్పులకు ఇప్పటికే మీసేవ ద్వారా దరఖాస్తులు అందుతున్నాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news