Hanuman Movie : హనుమాన్‌ మూవీ నుంచి క్రేజీ పోస్టర్

-

యంగ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న మూవీ ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్‌ను ప్రకటించింది చిత్ర బృందం.

ఈ మూవీని పాన్‌ వరల్డ్‌ స్థాయిలో మే 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ లాంటి భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌ లాంటి విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు ఆ ప్రచార చిత్రంలో చూపించారు. అంజనాద్రి అనే ఓ ఊహా ప్రపంచంలో సాగే కథ ఇది. అయితే.. శ్రీ రామ నవమి పండుగ నేపథ్యంలోనే హానుమాన్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ అప్డేట్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news