పెళ్లి చేసుకునే వారికి TTD శుభవార్త.. కళ్యాణమస్తు కార్యక్రమం పునఃప్రారంభం

-

పేదవారికి అండగా వుండడానికి కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూన్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆగష్ట్ 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాని నిర్వహిస్తూన్నామన్నారు. ఆగష్ట్ 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య మహూర్తం నిర్ణయించామని.. కలేక్టర్ కార్యాలయాలు,ఆర్డిఓ కార్యాలయాలో వివాహ జంటలు రిజిష్ర్టేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఇతర రాష్ర్టాలలో సియంలు ముందుకు వస్తే ….ఆ ప్రాంతాలలో కూడా టిటిడి నిర్వహించేందుకు సిద్దంగా వుందన్నారు. 2007 పిభ్రవరి 22వ తేదిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 6వ విడతలలో కళ్యాణమస్తూ కార్యక్రమం నిర్వహణ ద్వారా 45 వేల జంటలు ఒక్కటయ్యాయి.

2011 మే 20వ తేదిన కళ్యాణమస్తూ చివరి విడత నిర్వహించింది టిటిడి.. ఆర్దిక భారం,ఇతర మతస్థులు ,నకీలి జంటలు కళ్యాణమస్తూ కార్యక్రమంలో అందజేసే బంగారు తాళిబోట్టులు కోసం వివాహం చేసుకుంటున్నారని విజిలేన్స్ రిపోర్ట్ అందింది. విజిలేన్స్ రిపోర్ట్ మేరకు కళ్యాణమస్తూ కార్యక్రమాని నిలిపివేసిన అప్పటి ఇఓ ఐవైయ్యార్ కృష్ణారావు.. కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని 2013 లో ప్రయత్నించి విఫలమయ్యారు అప్పటి చైర్మన్ బాపిరాజు. ఇక సిఎం జగన్ ఆదేశాలు మేరకు ఎట్టకేలకు కళ్యాణమస్తూ కార్యక్రమాని పున:ప్రారంభిస్తోంది టిటిడి.

Read more RELATED
Recommended to you

Latest news