కమల్ హాసన్ కుటుంబాలను పాడు చేస్తున్నాడు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

-

తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి గురువారం మక్కల్ నీది మాయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్ మీద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ వంకతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ మంచి కుటుంబాలను పాడు చేస్తున్నాడు అని అన్నారు. 70 సంవత్సరాల వయస్సులో కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ చేసే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? అతని పని మంచి కుటుంబాలను పాడుచేయడమే.

పిల్లలు అలా చూస్తే వారు చెడిపోతారు, మంచి కుటుంబాలు కూడా చెడిపోతాయి అని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.జి.రామచంద్రన్ అవినీతిపై, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో కమల్ హాసన్ ను ఇలా ఎటాక్ చేశారని అంటున్నారు. అయితే ఈ అంశం మీద హాసన్ చాలా కూల్ గా స్పందించాడు. “బిగ్ బాస్ ను ముఖ్యమంత్రి కూడా చూస్తున్నారని” అందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news