“భారతీయుడు 2” కోసం కమల్ హాసన్ కు భారీ రెమ్యునరేషన్ ?

-

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ షణ్ముగం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సిద్దార్థ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో కొద్దిరోజుల క్రితం ఒక ఘోర ప్రమాదం జరిగి, సెట్ లోని భారీ క్రేన్ విరిగి పడి సెట్ లోని వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మారుతీ చెందారు. అయితే ఆ దుర్ఘటనతో ఒక్కసారిగా కోలీవుడ్ తో పాటు మిగతా సినిమా పరిశ్రమలు కూడా ఉలిక్కిపడ్డాయి.

ఇది ఇలా ఉండగా.. అయితే.. ఈ సినిమా కోసం కమల్‌ హాసన్‌ భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నాడట. తాజాగా వైరల్‌ అవుతున్న న్యూస్‌ ప్రకారం.. ఈ సినిమా కోసం కమల్‌ హాసన్‌… ఏకంగా.. రూ.150 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి ఇంత మొత్తం అంటే కోలీవుడ్‌ నుంచి ఇది భారీ మొత్తం అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version