కామారెడ్డిలో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ ఊహించని విధంగా స్కూల్ బస్సులో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన కామారెడ్డిలోని రామారెడ్డి రోడ్డు బుధవారం సంభవించింది. వివరాల్లోకివెళితే.. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెలుతుండగా ఆకస్మాత్తుగా బ్యాటరీ పేలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా బస్సులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అందులోని విద్యార్థులు భయంతో కేకలు వేశారు.
గమనించిన స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను రక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పిల్లంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే, పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలపై రవాణా శాఖ అధికారులు తరుచు తనిఖీలు నిర్వహించాలని, కేవలం విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగానే కాకుండా అడపదడపా ఆకస్మిక ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుండాలని పిల్లల పేరెంట్స్ కోరుతున్నారు.