వైసిపిలో ఉన్న స్క్రాబ్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయిందని బాంబ్ పేల్చారు వైసీపీ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎంపీ మిధున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు అధికారం అనుభవించి వెళ్లిపోయారని చురకలు అంటించారు.

వైసిపిలో ఉన్న స్క్రాబ్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయిందని సెటైర్లు పేల్చారు. వాళ్లు వెళ్లిపోవడం చాలా మంచిదన్నారు. ఇప్పుడు పార్టీలో మిగిలిన వారందరూ నిజమైన వైసీపీ కార్యకర్తలు అని కొనియాడారు. అధైర్య పడొద్దు కార్యకర్తలందరికీ అండగా ఉంటానని ప్రకటించారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు వైసీపీ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డి..