కాంచన 3 హీరోయిన్ సూసైడ్.. అతడి పైనే అనుమానం

-

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన 3 సినిమాలో దెయ్యంలా నటించిన రష్యన్ హీరోయిన్ అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంచన త్రీ లో అలెగ్జాండ్రియా తన నటనతో ఆకట్టుకుంది. దెయ్యం పాత్రలో పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అలెగ్జాండ్రియా కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలోనే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో అలెగ్జాండ్రియా చెన్నైలో ఓ ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. దాంతో ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలెగ్జాండ్రియా మృతిపై ఆమెతో నటించిన పలువురు నటి నటులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news