త‌లైవి గెట‌ప్ లో జ‌య‌ల‌లిత స‌మాధివ‌ద్ద‌కు కంగ‌నా..నెట్టింట వైర‌ల్..!

బాలీవుడ్ భామ కంగ‌నా ర‌నౌత్ త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఫైర్ బ్రాండ్ అచ్చం జ‌య‌ల‌లిత మాధిరిగానే క‌నిపిస్తోంది. టీజ‌ర్ ట్రైల‌ర్ లోనూ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత లుక్ లో అద‌ర‌గొట్టింది. ఇక తాజాగా మ‌రోసారి కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత గెటప్ లో క‌నిపించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. అయితే ఈ సారి కంగ‌నా సినిమా షూటింగ్ కోసం జ‌య‌ల‌లిత గెట‌ప్ ధ‌రించ‌లేదు.

త‌లైవి సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా క‌రోనా నేపథ్యంలో ఈనెల 10వ తేదీన‌ విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసందే. దాంతో ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని జ‌య‌లలిత గెట‌ప్ లో చెన్నై లోని మెరీనా బీచ్ లో ఉన్న జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి కంగ‌నా ర‌నౌత్ నివాళ్ల‌ర్పించారు. ఇక ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత గెట‌ప్ లో కంగ‌నా క‌నిపించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు ఈ ఫోటోల‌కు సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.