BREAKING : ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏఎంఆర్ డీఏ కమిషనర్ గా కె.విజయ బదిలీ కాగా సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా డా.పి.లక్ష్మీనరసింహం బదిలీ అయ్యారు. అలాగే ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి. ప్రశాంతి బదిలీ అయ్యారు.

ఇక గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీ గా జి. రాజ కుమారి బదిలీ అయ్యారు. అలాగే కడప జిల్లా ఆర్డీవో గా పి. ధర్మ చంద్రా రెడ్డి బదిలీ కాగా.. ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీ గా పృథ్వీ తేజ్ బదిలీ అయ్యారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పవర్ కార్పొరేషన్ ఎండీ గా పృథ్వీ తేజ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ బదిలీల నేపథ్యం లో కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news