Kanguva : ‘కంగువ’ టీజర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

-

శివ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ .పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది.సూర్య 5 విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విజువల్స్, సూర్య లుక్ టీజర్లో అదిరిపోయాయి.రూ.350 కోట్ల బడ్జెట్తో 10 భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.త్వరలోనే సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.కంగువ లో దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది .బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news