CAA పై స్టే కు సుప్రీంకోర్టు..పిటిషన్ల పై కేంద్రానికి నోటీసులు..!

-

కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సూప్రీం కోర్టు ఇవాళ మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్మత్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో దాఖలైన 230 పిటిషన్లపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక.. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9న వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్ లో కోరిన విషయం తెలిసిందే. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా సీఎఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news