ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తోందంటే క్రికెట్ అభిమానులకి పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.ఇక మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈక్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆటగళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లి
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు కోహ్లి న్యూ లుక్‌లో కన్పించాడు.
ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఫ్యాన్స్ ను అకట్టుకునే విరాట్ కోహ్లీ…. ఇప్పుడు మరో కొత్త హెయిర్ స్టైల్‌లో దర్శనిమిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లా వైరల్‌గా మారాయి. కాగా కోహ్లికి హెయిర్ స్టైల్ చేసింది ఎవరో కాదు.. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్.