సీఎం జగన్ హామీపై కన్నా ఫైర్.. రాజధానిలో రేపు కన్నా మౌనదీక్ష

-

ఏపీలో 3 రాజధానుల వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక సమర్పించిన రోజు నుంచీ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారు. రైతుల నిరసనలకు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతిచ్చాయి. ఇక బీజేపీ సైతం అమరావతిలో నిరసన కార్యక్రమానికి సన్నద్ధమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. రేపు మౌనదీక్షకు దిగనున్నారు.

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. శుక్రవారం ఉదయం 8.30గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవరాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news