విశ్వంభరకి పోటీగా కాంతార 2..!

-

వచ్చే ఏడాది రాబోయే సంక్రాంతి పండుగకి భారీ సినిమాలు విడుదల చేయడానికి ఆయా సినిమాల నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ విశ్వంభర ఒకటి. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ అధికారికాండ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మరొక పెద్ద సినిమా కూడా సంక్రాంతికి విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్నటువంటి కాంతారా సినిమాకి ఫ్రీక్వెలా మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ విషయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలుసు.డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కించగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.ఈ సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ వన్ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.డివోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో ఈ రెండిటిలో ఏ సినిమా ప్రేక్షకుల అదరణపొందుతుంది అనే ఉత్కంఠ ఇప్పటినుండే మొదలైయింది.

Read more RELATED
Recommended to you

Latest news