నాంపల్లి కోర్టులో దస్తగిరి పిటిషన్.. సీబీఐకి కీలక ఆదేశాలు

-

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.  తనను తన కుటుంబాన్ని కొందరు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రిపై దాడి చేసి గాయపర్చారని.. తన కుటుంబాన్ని రక్షించాలని, ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడంలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం దస్తగిరి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీబీఐ యాంటీ కరప్టన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వజర్ని కోర్టు ఆదేశించింది. దస్తగిరి చేసిన ఆరోపణలపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని సూచించింది. దస్తగిరి తరపున న్యాయవాడి జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు దస్తగిరి ఫిర్యాదుపై సీబీఐ అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఈ మేరకు కడప జిల్లా పులివెందులకు సీబీఐ అధికారులు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news