తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించిన సర్కారు, అవసరమైన వాళ్లందరికీ ఉచితంగా కళ్లద్దాలు, కంటి ఆపరేషన్లు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ ప్రకటన మాత్రం నిర్దేశించిన ఐదు నెలల్లో పూర్తిగా అమలు కాలేకపోయింది. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇచ్చిన సర్కారు ఆపరేషన్లు మాత్రం పూర్తిగా నిర్వహించలేకపోయింది.
ఇప్పటికే అమలవుతున్న పలు పథకాలతో పాటు కంటి వెలుగు పథకాన్ని కూడా మరో మారు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జనవరి నెల నుంచి ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించనుంది ప్రభుత్వం. అంతేకాదు కంటి వెలుగు పథకాన్ని శాశ్వతంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ స్కీం ద్వారా నిరంతర సేవలు కొనసాగనున్నాయి.