ఈ తప్పు చేస్తే.. అకౌంట్ ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త..!

-

ఈ మధ్య కాలంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. అందుకని ప్రతీ ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు విషయంలో జాగ్రత్తగా ఉండక పోతే
మోస పోవాల్సి వస్తుంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఈ మధ్యన ఎక్కువగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌ జరగడంతో అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంటోంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే అకౌంట్ కాళీ అయ్యిపోవచ్చు. చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన సమస్యలు వస్తున్నాయి. తాజాగా ఒక అతని అకౌంట్ పూర్తిగా ఖాళీ అయ్యిపోయింది. ఆర్డర్ ఏమి చెయ్యకుండా డెలివరీ బాయ్ వేషంలో కొన్ని గూడ్స్‌తో డెలివరీ చేసేందుకు ఒక అతను వచ్చాడు. ఆర్డర్ ఏమి చెయ్యలేదని చెప్తే ఆర్డర్ కాన్సల్ కోసం ఓటీపీ చెప్పమన్నాడు.

తరవాత బ్యాంకు ఖాతా ఖాళీ అయింది. హ్యాకర్లు ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించే వీలుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి. పర్సనల్ వివరాలను కనుక చెప్పారంటే నష్టపోవాల్సియి ఉంటుంది. కాబట్టి అలాంటి వివరాలను అస్సలు ఇవ్వకండి. పర్సనల్ విషయాలు చెబితే మోసపోయినట్లే అని తెలుసుకోండి. SMS లింక్స్, బోగస్ ఈ- మెయిల్స్ వంటివి ఫోన్‌కు పంపించేసి వాటిని ఓపెన్ చేసేలా ఆకర్షణీయంగా మెసే‌జ్‌లు పంపిస్తారు.

అలానే రివార్డ్స్, క్యాష్ బ్యాక్, రీఫండ్స్, బోనస్ పాయింట్లు, లాటరీలు వచ్చాయని ఎవరైనా చెప్తే ఏ మాత్రం నమ్మకండి. నమ్మితే గోతులో పడినట్టే. ఇలాంటి సమస్యలు ఏమి వుండకూడదు అంటే ఈ- మెయిల్స్, పాప్- అప్ లేదా SMS వంటి వాటిని జాగ్రత్తగా చదవండి. క్యాష్ బ్యాక్, రీఫండ్ స్కీమ్స్ తో మెసే‌జ్లకు దూరంగా ఉండాలి. అలానే CVV, OTP, PIN, అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్ మొదలైన డీటెయిల్స్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news