నా ఆస్తి ఎందుకు తప్పు చెప్పారు…? 1.1 కాదు 3.3 బిలియన్..!

-

డబ్బు ఉన్న వాడిది ఒక బాధ లేని వాడిది మరో బాధ. లేని వాడు లేక చస్తే ఉన్న వాడు ఉండి చచ్చాడు అని ఒక సామెత కూడా ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఆస్తి ఫోర్బ్స్ లో తక్కువ చెప్పారు. దీనితో బాబుకి చాలా కోపం వచ్చేసింది. వాట్ దిస్ నాన్సెన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు ఆయన. రాపర్ కేనీ వెస్ట్ అధికారికంగా బిలియనీర్ క్లబ్‌లో జాయిన్ అయారు. ఫోర్బ్స తాజాగా ప్రకటించిన జాబితాలో వెస్ట్‌ ఈ జాబితాలో చేరారు.

వీటిపై అతను అసహనం వ్యక్తం చేసాడు. తన ఆస్తిని తక్కువగా చూపించారని వాస్తవానికి అందుకు రెండు రెట్ల కంటే ఎక్కువే ఉంటుందని అతను చెప్పడం గమనార్హం. తన ఆస్తుల విలువ ఎవరికి తెలియదు అన్నాడు ఆయన. వెస్ట్ ఆస్తుల విలువ 1.23 బిలియన్ డాలర్లు (9వేల కోట్ల రూపాయలకు పైగానే) ఉంటదని ఫోర్బ్స్ చెప్పగా… తన ఆస్తి 3.3 బిలియన్ డాలర్లు (25 వేల కోట్ల రూపాయలకు పైగానే) ఉంటది చెప్పాడు.

ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాతో తాను సంతృప్తిగా లేనని, వాస్తవానికి తనను సంప్రదించి ఉంటే కచ్చితమైన సంఖ్య చెప్పేవాడినని అతను చెప్పడం గమనార్హం. వెస్ట్ వద్ద 17 మిలియన్ డాలర్ల (129 కోట్ల రూపాయలు) నగదు, 35 మిలియన్ డాలర్ల (267 కోట్ల రూపాయలు) స్టాక్, 81 మిలియన్ డాలర్ల (618 కోట్ల రూపాయలు) భవనాలు, 21 మిలియన్ డాలర్ల (160 కోట్ల రూపాయలు) భూములు ఉన్నాయని అతని టీం చెప్పడం గమనార్హ౦.

Read more RELATED
Recommended to you

Latest news