వకీల్ సాబ్ లేటెస్ట్ అప్ డేట్!

-

ఎంత పాపులర్ హీరోకి అయినా వరుసగా ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయినా తర్వాత వచ్చే సినిమాపై కాస్త క్రేజ్ తగ్గినట్లు కనిపిస్తుంటుంది! కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈ ఆలోచన సూట్ కాదు! వరుస ఫ్లాప్స్ వచ్చినా… సినిమాకి సినిమా భారీగా ఎడమ వచ్చినా కూడా క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది. ఈ క్రమంలో పవన్ తాజాగా నటిస్తోన్న చిత్రం “వకీల్ సాబ్”! ఈ సినిమా విడుదలకి సంబందించి వస్తున్న కథనాలతో ఫ్య్యాన్స్ కంఫ్యూజన్ లో పడుతున్న దశలో… నిర్మాత దిల్ రాజునుంచి క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు సినీ జనాలు!

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ‘దిల్’ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు, లాక్ డౌన్ ఎత్తేయగానే అనుమతులు దొరికితే మొదలుకానున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల ఆగష్టు లో ఉండొచ్చని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ కాస్త ఫుల్ హ్యాపీ ఫీలయిపోయారు. ఈ క్రమంలో ఈ వకీల్ సాబ్ సినిమా విడుదల గురించి.. నిర్మాత దిల్ రాజు చేసిన ప్రకటనతో డల్ అయిపోయారంట ఫ్యాన్స్!

అవును… లాక్ డౌన్ అనంతరం వకీల్ సాబ్ సినిమా షూటింగు పూర్తయిపోయినప్పటికీ… సినిమాను మాత్రం ఇప్పట్లో విడుదల చేసే ఆలోచన చేయడం లేదన్ని చెబుతున్నారంట నిర్మాత దిల్ రాజు. అన్నీ అన్నుకూలంగా జరిగితే… సంక్రాంతి బరిలో వకీల్ సాబ్ ని దింపాలని భావిస్తున్నారంట! అప్పటికి సంక్రాంతి సీజన్ పరిస్థితి యమా టైట్ గా ఉంటే మాత్రం… కాస్త ఆగి… రిపబ్లిక్ డే కి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. దీంతో… వీలైతే సంక్రాంతి… లేదంటే రిపబ్లిక్ డే అంట అని నిట్టూర్పులు వదులుతున్నారంట పవన్ ఫ్యాన్స్!

Read more RELATED
Recommended to you

Latest news