విశాఖపట్నం డిఆర్సీ వివాదం మీద చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందించారు. మొన్న ఈయనకు విజయసాయి రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ అంశం మీద స్పందించిన ధర్మశ్రీ డిఅర్సీలో మాదంతా ఓపెన్ అని అన్నారు. ప్రతిపక్షం లేదుకదా.. ఆభాద్యతకూడా మేమే వహించాలని అన్నారు. ఎవరిమీదా ద్వేషమో, అక్కసో మాకు లేదు, పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవన్న ఆయన ప్రజాప్రతినిధులుగా మా బాద్యత మేము నిర్వర్తించాలి..అధికారులు అలసత్వం వహించడం సరికాదని అన్నారు.
ఫలాలు సకాలంలో ప్రజలకు ఇవ్వాలనే లక్ష్యంలో అధికారులూ భాగస్వాములేనని అన్నారు. పాలవలస భూములు నూరుశాతం జెన్యూన్ అని, అది అసైన్డ్ భూమికాదు…ఎక్స్ సర్వీస్ మెన్ కు అలాట్ చేసిన ల్యాండ్ అని అన్నారు. అసైన్డ్ భూమిని రెగ్యులర్ చేయమని ఎవ్వరూ అడగరని అన్నారు. ప్రభుత్వ భూమినే ఎక్స్ సర్వీస్ మెన్ కు కేటాయించారని, గత కలెక్టర్ కూడా దాన్ని రిజెక్ట్ చేయలేదని అన్నారు. డిఆర్సీ వివాదంపై సిఎమ్ తో భేటీ అయిన విషయం అవాస్తవమన్న ఆయన నేను కూడా టివీల్లో స్క్రోలింగ్ చూశానని అన్నారు.