పాక్‌పై యుద్ధం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయ్ జూలై 26వ తేదీన పూర్తయి పాక్‌పై భారత్ యుద్ధంలో గెలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇక యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు అప్పటి నుంచి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ రోజున నివాళులర్పిస్తున్నారు.
కాశ్మీర్‌ను ఆక్రమించుకుని అంతర్జాతీయంగా ఆ సమస్యను పెద్దదిగా చేయాలని పాక్ ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. అందుకనే ఆ దేశం ఎప్పుడూ ఉగ్రవాదుల ముసుగులో భారత్‌పై కాల్పులు జరుపుతూనే ఉంది. ఇక నేరుగా ఉగ్రవాదులను కూడా పాక్ భారత్‌పైకి ఉసిగొల్పుతూ వస్తోంది. అయితే పాకిస్థాన్ ఎప్పుడు ఏ దాడి చేసినా.. భారత్ సమర్థవంతంగా దాన్ని తిప్పికొడుతోంది. ఇక 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనైతే భారత్ పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. భారత్‌పై యుద్ధానికి దిగితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో పాక్‌కు భారత్ రుచి చూపించింది.
1999లో మే 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు దాదాపుగా 60 రోజుల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ క్రమంలో జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగియగా భారత్ విజయకేతనం ఎగుర వేసింది. భారత సైనిక బలం ముందు నిలబడలేని పాక్ సేనలు తోక ముడిచాయి. భారత్‌తో ఇక యుద్ధం చేయలేమని చెప్పి పాక్ వెనుకకు వెళ్లిపోయింది. దీంతో జూలై 26వ తేదీని అప్పటి నుంచి కార్గిల్ విజయ్ దివస్‌గా భారత ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ రోజున దేశంలోని అనేక ప్రాంతాల్లో అమర వీరుల సంస్మరణ సభలు జరుగుతాయి. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులను ఆ రోజున అందరూ గుర్తు చేసుకుంటారు.
పాక్‌పై యుద్ధం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయ్ జూలై 26వ తేదీన పూర్తయి పాక్‌పై భారత్ యుద్ధంలో గెలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇక యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు అప్పటి నుంచి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ రోజున నివాళులర్పిస్తున్నారు. కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు చేపట్టిన దుశ్చర్యను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. యుద్ధంలో భాగంగా పాక్ ఆక్రమించుకున్న ఎన్నో ప్రాంతాలను భారత్ మళ్లీ స్వాధీనం చేసుకుంది. కార్గిల్ యుద్ధంలో పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్‌గా మనం జరుపుకుంటున్నాం..!