గెలుపోటములు బిజెపికి కొత్తేమీ కావు – యడియూరప్ప

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమి దాదాపుగా ఖరారైంది. ఈ ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప స్పందించారు. గెలుపోటములు బిజెపికి కొత్త కాదని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఓటమిపై సమీక్షిస్తామని పేర్కొన్నారు. రెండు స్థానాలతో ప్రారంభమైన బిజెపి ప్రస్థానం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి వరకు కొనసాగిందన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలపై పార్టీ శ్రేణులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు యడ్యూరప్ప. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సర్కార్ కు అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news