ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటాం – సినీనటి కరాటే కళ్యాణి

-

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామని సినీనటి కరాటే కళ్యాణి ప్రకటించారు. ఈ తరుణంలోనే.. మాదాపూర్ మంచు విష్ణు ఆఫీస్ కి వెళ్లి కలిశారు కళ్యాణి. ఎన్టీఆర్ విగ్రహాన్ని అడుకోవట్లేదు, శ్రీ కృష్ణుడు అవతారంలో ఉన్న విగ్రహాన్ని అడ్డుకుంటామన్న కల్యాణి తెలిపారు. మా డిసిప్లీనరీ కమిటీ మీ పై చర్యలు తీసుకోమని ఒత్తిడి చేస్తుందని తెలిపారు మంచు వి ష్ణు.

ఎలాంటి నోటీసుల కైనా వివరణ ఇస్తానని కల్యాణి తేల్చి చెప్పారు. షో కాజ్ నోటీసులు ఇస్తాము, వివరణ ఇవ్వండి అంటూ కోరిన విష్ణు… బాలకృష్ణ, మురళీమోహన్ ఇంకొందరు మీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. నేను అన్ని రకాలుగా ఎదురుకోవడానికి సిద్ధం అని కల్యాణి ప్రకటించారు. అటు కరాటే కల్యాణికి మద్దతు పలికిన శివ బాలాజీ.. ఫోన్ చేసి మద్దతు తెలిపారు. మా అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీ. మీకు మేము అండగా ఉంటామన్నారు శివ బాలాజీ. అటు మా అసోసియేషన్ హెచ్చరింపు పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కుల హిందూ సంఘాలు.

Read more RELATED
Recommended to you

Latest news