ఇచ్చిన హామీలని పాతరేసిన కాంగ్రెస్: కర్నె ప్రభాకర్

-

తాజాగా మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కామెంట్స్ చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేసిందని నమ్మిన ప్రజలు ఓటు వేస్తే హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియా తో మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తీర్పుని గౌరవించింది బీఆర్ఎస్ అని అన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వాళ్ళ బాధ్యత ని గుర్తు చేస్తూనే ఉంటామని కేటీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ లో అసలు అభివృద్ధి జరగను జరిగినట్టుగా ప్రజల్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని అన్నారు కర్నే ప్రభాకర్. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version