కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప..కార్తీక్ గురించి మంచిమాటలు చెప్పి పిల్లలను నిలదీస్తుంది. కార్తీక్ హిమను పట్టుకుని బంగారం నేనేం తప్పు చేయలేదురా, మీరు ఏడిస్తే మీ నాన్న తట్టుకోలేడురా..నాకు కూడా ఏడుపొస్తుంది అని పిల్లలు ఇద్దరిని దగ్గరకు తీసుకుంటాడు.
ఇంట్లో ఉన్న దీప..ఆ పేపర్ ని అనుబాంబులాగా పట్టుకుని రూంలోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేసుకుని చదువుతుంది. కార్తీక్ తో ఉన్న మధురజ్ఞాపకాలను తలుచుకుని బాధపడుతుంది. వార్తను చదువుతుంది. ఇటు మోనిత కూడా వార్తను చదువుతంది. దీప ఏడ్చుకుంటూ చదివితే..మోనిత నవ్వుకుంటూ చదువుతుంది. ఈ సీన్ ఒకేసారి చూపిస్తారు. బాగా లాగ్ చేస్తారు ఈ సీన్. పాపం దీప ఆ వార్తను చదివి బాగా ఏడుస్తుంది. ఇంతలో శౌర్య తలుపుతీయ్ మని డోర్ కొడుతుంది.. దీప కంగారుగా ఆ పేపర్ ని బెడ్ కింద పెడుతుంది. ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని శౌర్య పదే పదే అడుగుతుంది. ఏం లేదని దీప చెబుతుంది. రెడీ ఐ పూజ దగ్గరకు రమ్మని నానమ్మ చెబుతుంది అని శౌర్య అంటుంది. కట్ చేస్తే పూజ స్టాట్ వస్తుంది. పూజను ఆనందంగా చేస్తారు. ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చి హాయ్ అమ్మమ్మ, హాయ్ తాతయ్య అంటారు. హిమ, శౌర్యలకు వాళ్లెవరో అర్థంకాదు. సౌందర్య, ఆనంద్ రావులు ప్రేమగా రండిరా అంటారు. ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకుంటారు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.