హుజూరాబాద్ తోపాటు మరో 30 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాలకు..

-

ప్రతిష్టాత్మక హుజూరాబాద్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. దీంతో పాటు దేశంలోని 30 అసెంబ్లీ స్థానాలకు, మరో 3 పార్లమెంట్ స్థానాలకు ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగనున్నాయి. గెలుపొందిన అభ్యర్థులు చనిపోవడమో లేకపోతే వేరే కారణాల వల్ల రాజీనామాలు చేయడమో, అనర్హతల కారణంగా డిస్ క్వాలిఫై కావడం మూలంగానో ఈ ఉపఎన్నికలు జరుగుతు

న్నాయి. సాధారణంగా ఏదైనా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సిందే. దీనికి అనుగుణంగానే ప్రస్తుత షెడ్యుల్ విడుదలైంది. తెలంగాణలో హుజూరాబాద్ లాగే పశ్చిమ బెంగాల్లోని 4 అసెంబ్లీ ఎన్నికలు కూడా అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి. దాద్రనగర్ హావేళి, మధ్యప్రదేశ్లోని కాండ్వా, హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యాణా, మిజోరాం, మహారాష్ట్ర, నాగాలాండ్ లో ఒక్కో స్థానానికి, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో 2 స్థానాలకు, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్లలో 3 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలకు, అస్సాంలో 5 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version