నిఖిల్ ‘కార్తికేయ 2’ పోస్టర్స్‌ ఎలా క్రియేట్‌ చేశారంటే?

-

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘కార్తికేయ – 2’. చందు మొండేటి దర్శకుడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు నటించారు. కాల భైరవ సంగీతం అందించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.

శ్రీ కృష్ణ జన్మ రహస్యం, ద్వారకా నగర ప్రాముఖ్యత నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా పోస్టర్లు మొదటి నుంచి సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీనివాసరెడ్డి, అనుపమలతో కలిసి నిఖిల్‌ ద్వారకా నగరానికి వెళ్తున్నట్లు, అలాగే ఆయన సాహసోపేతంగా పాముని పట్టుకుంటున్నట్లు.. ఇలా ‘కార్తికేయ – 2’ పోస్టర్లు సినిమా విడుదలకు ముందే అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. కాగా, ‘కార్తికేయ -2’ సినిమా పోస్టర్లు ఎలా సిద్ధం చేశారో తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ఓ వీడియో విడుదల చేసింది.

నిఖిల్‌, అనుపమల ఫొటోషూట్‌తోపాటు పోస్టర్స్‌ని ఎలా డిజైన్‌ చేశారో ఈ వీడియోలో చూపించారు. సాధారణ చిత్రంగా విడుదలైన ‘కార్తికేయ -2’ దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక, నిఖిల్‌ ఈ చిత్రాన్ని తాజాగా హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌లో వీక్షించారు. ‘‘37వ రోజు. ఎట్టకేలకు రహస్యంగా బిగ్‌స్క్రీన్‌పై ఫైనల్‌గా కార్తికేయ-2 చూస్తున్నా’’ అని క్యాప్షన్‌ జతచేశారు.

ఇక సినిమా విషయానికి వస్తే… కృష్ణుడు, ద్వారకానగరం చుట్టూ కథను అల్లుకోవడంతోనే సగం విజయం సాధించింది చిత్ర బృందం. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ. ఈ నమ్మకంతోనే ‘కార్తికేయ2’ను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేశారు. తొలిరోజు నుంచే అక్కడి ప్రేక్షకులు సినిమాకు త్వరగానే కనెక్ట్‌ అయ్యారు. కథ చిన్నదే అయినా.. కృష్ణతత్వం చుట్టూ తిరిగే కథనం, సంభాషణలు అక్కడి వారిని మెప్పిస్తున్నాయి. పైగా, అనుపమ్‌ఖేర్‌లాంటి నటులు కూడా ఉండటం అదనపు ఆకర్షణ తెచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version