కార్తీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సర్దార్ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్

-

కంటెంట్ ఉన్న స్టోరీలతో తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటాడు కార్తీ. ఇటీవలే ]పొన్నియున్ సెల్వన్’, ‘సర్దార్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. పీఎస్ మిత్ర‌న్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ.. స‌ర్దార్ మూవీ స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. అక్టోబర్ 21న తెలుగు, తమిళంతోపాటు  వివిధ భాషల్లో విడుదలై మంచి టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతోంది. ఈ మూవీకి సీక్వెల్‌ ఉంటుందని సినిమా చివరలో హింట్ ఇచ్చాడు డైరెక్టర్ మిత్రన్.

‘సర్దార్ 2’ చిత్రంపై కార్తీ టీం అధికారికంగా అప్‌డేట్‌ ఇచ్చి కార్తీ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఒకసారి స్పై అయితే, ఎప్పుడూ స్పై.. మిషన్‌ కంబోడియా త్వరలో మొదలవుతుంది అంటూ మేకర్స్‌ సర్దార్‌ 2 గురించి చెబుతూ చిన్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పీఎస్‌ మిత్రన్‌ డైరెక్ట్‌ చేయనున్న ‘సర్దార్‌ 2’ మూవీ 2023లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news