BIG BREAKING: టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది. టీడీపీ పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో సత్తా చాటుకుందని కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ పోటీకీ అధిష్ఠానం నో చెప్పడంతో కాసాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

కాసాని మాట్లాడుతూ… పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా… కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.

అలాంటప్పుడు నేను ఎందుకు?: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

”119 స్థానాల్లో టీడీపీ గెలవకపోయినా.. తప్పుకుండా 20 నుంచి 25 సీట్లు గెలిచేది. చంద్రబాబు జైలుకి వెళ్లాక ఏ విధంగా ఉప్పెనలా కార్యక్రమాలు జరిగాయో అంతా చూశారు. ఈసారి ఎక్కువ గ్రోత్ ఉండే. చంద్రబాబుకి ఏం బాధ ఉందో తెలియదు కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు” అని కాసాని అన్నారు.

అంతేకాకుండా.. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసి వచ్చాను అని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. నేను ఫోన్ చేస్తే.. నారా లోకేష్ లిఫ్ట్ చేయలేదన్నారు. తెలంగాణలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నాం.. చంద్రబాబు ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారు.. నన్ను ఎందుకు పార్టీలో పిలిచారు అని చంద్రబాబును అడిగాను.. అభ్యర్థులు తయారయి ఉన్నారు.. క్యాడర్ కు పార్టీలో ఉండి న్యాయం చేయలేను.. అందుకే టీడీపీకి రాజీనామ చేస్తున్నాను అని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news