తేజస్వి మదివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాతో అల్లరి పిల్లగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత మనం, కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు , పండగ చేసుకో.. వంటి ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్గా నటించడమే కాకుండా బోల్డ్ క్యారెక్టర్ లో నటించి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె తాజాగా వచ్చిన కమిట్మెంట్ సినిమాతో కూడా మరొకసారి హాట్ బాంబు పేల్చిందని చెప్పవచ్చు. కమిట్మెంట్ సినిమాలో చాలా బోల్డ్ గా నటించిన తేజస్వి తగ్గకుండా అంతే బోల్డ్ గా డైలాగ్స్ విసురుతూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇక ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. ఇకపోతే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన ప్రవర్తనతో నెగిటివిటీని మూటకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకుంది. ఇక బిగ్ బాస్ సమయంలో తన అనుభవాల గురించి వెల్లడించింది. ఈ క్రమంలోనే తేజస్వీ మాట్లాడుతూ బిగ్ బాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు దిమ్మ తిరిగి పోయిందని కామెంట్స్ చేసింది. సినిమాలన్నీ ఒక ఎత్తైతే బిగ్ బాస్ మరొక ఎత్తు అంటూ సంచలనాలకు దారితీసింది తేజస్వి..
అంతేకాదు కౌశల్ మండ ఆర్మీ నన్ను టార్గెట్ చేసి మరీ టార్చర్ చేశారు అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎటాక్ అని నేను ఫీల్ అయ్యాను.. నాపై చెత్త చెత్తగా మీమ్స్ చేసి మరీ నన్ను బ్యాడ్ చేశారు. ఇక అందువల్ల ఒక వ్యక్తి ముందుకు వెళ్లొచ్చు కానీ నేను ఒక ఆడపిల్లను.. నా దగ్గర ఏముందని నన్ను ఇంత టార్చర్ చేశారు.. ముఖ్యంగా కౌశల్ వల్ల పూర్తిస్థాయిలో ఇబ్బంది పడ్డాను అంటూ ఆమె తెలిపింది. అంతేకాదు ఇంత చేసిన అతడు ఇప్పుడు ఎక్కడ లేడు.. కానీ చాలా కాలం తర్వాత కమిట్మెంట్ స్క్రిప్ట్ నా దగ్గరకు రాగానే నేను ఒప్పుకున్నాను.. అంటూ తేజస్వి చేసిన వ్యాఖ్యలు కాస్త వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి.
<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/gR1aNKPQcII” title=”Actress Tejaswi Madivada Exclusive Interview | Commitment | Bigg Boss | Mana Stars” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>