BREAKING : 9 ఫోన్లను ఈడీ విచారణకు తీసుకెళ్లిన కల్వకుంట్ల కవిత

-

ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కవిత మెడ చుట్టూ బిగుసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు ఈడి విచారణను ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత… ఇవాళ మరోసారి ఈడి అధికారుల ముందుకు వెళ్ళనుంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి… ఈడి ఆఫీస్ కు కల్వకుంట్ల కవిత బయలు దేరారు.

ఈ తరుణంలోనే తన దగ్గర ఉన్న 9 ఫోన్ లను కవిత తీసుకువెళ్లారు. అలాగే.. మీడియాకు ఆ తొమ్మిది ఫోన్లను చూపిస్తూ మరి… ఈ డి ఆఫీస్ కు బయలుదేరింది కల్వకుంట్ల కవిత. తాను ఏ ఫోన్ కూడా ధ్వంసం చేయలేదని అర్థం వచ్చేలా తన ఫోన్లను మీడియాకు చూపించింది కవిత. అనంతరం నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్ళింది కల్వకుంట్ల కవిత. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news