పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.. ఇందులో హీరోయిన్ సెలక్షన్ కంప్లీట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి అవకాశం లభించింది అనే వార్త వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో మలయాళం హీరోయిన్ మాళవిక ఇందులో హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం మాళవిక పేరుతో తెలుగులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. రవితేజ నేల టికెట్ సినిమాల్లో నటించిన మాళవికా శర్మ ఒకరు కాగా.. ఇటీవల నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో నటించిన మాళవిక నాయర్ ఒకరు. ఇప్పుడు మరొక హీరోయిన్ మాళవిక మోహనన్ ఈమె పవన్ కళ్యాణ్ సరసన నటించబోతోంది.
ఇకపోతే మాళవిక మోహనన్ నటించిన తెలుగు సినిమా ఒక్కటి కూడా నేరుగా విడుదల కాలేదు. అయితే డబ్బింగ్ సినిమాలు విజయ్ మాస్టర్, రజినీకాంత్ పేటతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆమె అయితే ఇప్పుడు ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాకముందే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ సినిమా తమిళ హిట్ తేరికి రీమేక్ ఇక తెలుగు నేటివిటీ కి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇకపోతే గబ్బర్ సింగ్ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.