ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ హిజాబ్’ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో ఓ కాలేజీలో చిన్న వివాదంగా ప్రారంభం అయిన ఈ అంశం మెల్లిగా కర్ణాటక మొత్తానికి పాకింది ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం చిక్ మంగళూర్, బెళగావి, మాండ్యా, కొప్పెల జిల్లాలకు పాకింది. దీంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వివాదం కర్ణాటక హైకోర్ట్ లో ఉంది. నేడు కూడా విచారణ జరుగనుంది.
అయితే తాజాా టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. సింధూరం పెట్టుకోవడం, హిజాబ్ ధరించడం మా ఇష్టమని వ్యాఖ్యానించింది. సింధూరం పెట్టుకోవడం నా ఇష్టమని.. హిజాబ్ ధరించడం ముస్కాన్ ఇష్టమని అన్నారు. స్త్రీల ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అదే నిర్ణయించుకోనివ్వండి అంటూ.. మాకు నేర్పించకండి అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది.
ఇటీవల మాండ్యాలో తనను చుట్టుముట్టి జై శ్రీరాం అంటున్న యువకుల ముందు అల్లహో అక్బర్ అంటూ నినాదాలు చేసింది ముస్కాన్ అనే అమ్మాయి. ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.