ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న బీజేపీ ఎంపీ.. ఈ స్కాంలో కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. అయితే.. దీనిపై స్వయంగా కల్వకుంట్ల కవిత స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.. బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహించారు.
ఎవరి మీద వారిమీద ఆరోపణలు చేయడం సరైంది కాదు.. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని ఇలాంటి ఆలోచన చేస్తున్నారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు కవిత.
ఇది వ్యర్థ ప్రయత్నాలు మిగిలిపోతాయి.. కేసీఆర్ ని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు.. మాపై ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకర వాతావరణం కాదు.. ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడం సరైంది కాదు.. లిక్కర్ స్కాంలో ఎలాంటి సంబంధం లేదు.. కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎండగడుతున్నారు.. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.
Telangana | I want to make it clear that all allegations against me by BJP are baseless. I've nothing to do with ongoing Delhi liquor policy probe.BJP trying to malign the reputation of my family. We're not those who're going to step down, we'll put up a fight: K Kavitha,TRS MLC pic.twitter.com/lSJggrIrwp
— ANI (@ANI) August 22, 2022