షర్మిల కొత్త పార్టీ వెనుక కేసీఆర్.. అదే కారణం ?

Join Our Community
follow manalokam on social media

షర్మిల కొత్త పార్టీకి సంబంధించి తెలంగాణా బీజేపీ నేత ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవీపీ అండతో కేసీఆర్ ని కాపాడడం కోసం లోటస్ పాండ్ డ్రామా.. సిస్టర్ షర్మిల తో పార్టీ పెట్టిస్తున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ ఎక్కడ చంద్రబాబు అవతారం ఎత్తుతాడేమోనని ఎమ్మెల్యే లందరికి సీట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారని అన్నారు. కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నామని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ కి మేయర్ పదవి అప్పగిస్తున్న కారణంగా mimకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీట్ ఇస్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ వారికి స్టాండింగ్ కౌన్సిల్ లో స్థానం ఇస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ని ఇంకా ఎందుకు ప్రకటించలేదు అంటే కమ్మ్యూనిస్ట్ లకు ఇవ్వాలని చూస్తున్నాడని అన్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ లో పుట్టిన ముసలాన్నీ ఎదుర్కోవడానికి ఎత్తుగడ కాంగ్రెస్ కమ్యూనిస్టు లతో దోస్తీ చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ నేతలని ప్రాసిక్యూషన్ చేయకుండా విముక్తి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎంఐఎం అక్బరుద్దీన్ ఇతర నేతల ను క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. 

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...