సాధారణంగా మనం పొన్నగంటి ఆకులతో పప్పు, కూర వంట చేసుకుని తింటుంటాం. కానీ చాలా మందికి దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలియవు. ఎప్పుడూ కూడా ఆకుకూరల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. అలానే పొన్నగంటి కూర లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. అయితే పొన్నగంటి కూర తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి..?, నిజంగా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? వంటివి చూద్దాం. పొన్నగంటి కూరని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిజంగా జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇది ఔషధంలా పని చేస్తుంది ఆయుర్వేద ఔషధాలలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.
ఇది ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీన్ని ఇళ్లల్లో చిన్న చిన్న కుండీలలో వేసి పెంచుకుంటే ఎంతో సులువుగా పెరుగుతుంది. ఇవి ఏడాది పొడవునా కూడా లభిస్తాయి. ఇక ఉపయోగాలు లోకి వెళ్తే…. బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే తరచు దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా మెరుగు పడుతుంది. అంతే కాదండి పొన్నగంటి కూర లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. పైగా గుండె సమస్యలు కూడా అదుపు చేస్తాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా ఇది సహాయపడుతుంది. పొన్నగంటి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ తగ్గుతుంది. ఎముకల ఎదుగుదలకు కూడా ఇది సహాయ పడుతుంది. దీనిలో కాల్షియం ఆస్టియోపొరోసిస్ వంటి వాటిని కూడా దూరం చేస్తుంది. మూత్రపిండ సమస్యలతో బాధపడే వాళ్ళు వైద్యుల సలహా తోనే తీసుకోవాలి గుర్తుంచుకోండి. చూశారా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో..! మరి మీ డైట్ లో చేర్చండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.