సండ్ర వెంకటవీరయ్య…తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. వరుసగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నాయకుడు. మూడు సార్లు కూడా వీరయ్య, తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే తెలంగాణలో టీడీపీ పార్టీ దాదాపు క్లోజ్ అయిపోయింది.
దీంతో 2018 ఎన్నికల్లో గెలిచాక వీరయ్య…టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అయితే మంత్రి హామీ ఇవ్వడంతోనే వీరయ్య టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళినట్లు కథనాలు కూడా వచ్చాయి. పైగా అశ్వరావుపేట టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని కూడా టిఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తే పదవి గ్యారెంటీ అని టిఆర్‌ఎస్ అధిష్టానం షరతు కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే అనుకున్న విధంగానే మెచ్చాని కూడా టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చేశారు.
కానీ వీరయ్యకు ఇంతవరకు ఎలాంటి పదవి రాలేదు. అయితే ఇటీవల కేసిఆర్ దళితులని ఆకట్టుకునే కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దళితబంధు పేరిట భారీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే దళిత నాయకులకు కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసిఆర్…మంత్రివర్గాన్ని మరోసారి విస్తరణ చేయడానికి ఫిక్స్ అయ్యారని, ఈ సారి దళిత నాయకులకు ప్రాధాన్యత ఇస్తారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేసిఆర్ మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ ఒక్కరే దళిత వర్గం నుంచి ఉన్నారు. ఈ క్రమంలోనే వీరయ్యని కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.
వీరయ్యే గాక మరికొందరు దళిత నేతలు మంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. … మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, రాజయ్యలతో పాటు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, అబ్రహం, మోతుకు ఆనంద్, క్రాంతి కిరణ్, సాయన్నలు మంత్రి రేసులో ఉన్నారని తెలుస్తోంది. మరి చూడాలి టిడిపి నుంచి వచ్చిన వీరయ్యకు కేసిఆర్ బంపర్ ఆఫర్ ఇస్తారో లేదో?