మోడీ సర్కార్ కూడా భారీగా అవినీతి చేసింది..ఆ చిట్టా విప్పుతా : కెసిఆర్ సంచలనం

-

కేంద్ర ప్రభుత్వం పై మరోసారి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ సీఎం కేసీఆర్ అవినీతి పై మాట్లాడుతుంది. అయితే ఈ సారి మాత్రం భారతీయ జనతాపార్టీ పై రివర్స్ అటాక్ చేశారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం భారీగా అవినీతి చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో శాఖలో అతిపెద్ద అవినీతి జరిగిందని తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. మోడీ సర్కార్ చేసిన అవినీతి మొత్తం చిట్టా తన దగ్గర ఉందని హెచ్చరికలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

దేశంలోని ముఖ్యమంత్రులంతా తనకు ఫోన్లు చేస్తున్నారు అని… కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పై పోరాటానికి ఎవరితోనైనా కలిసి కొట్లాడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తప్పుబట్టారు సిఎం కేసీఆర్. ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.. ఇదా మన సంప్రదాయమా ప్రధాని మోడీ, నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సిఎం కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version