తెలంగాణా వీర జవాన్ కు 50 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన కేసీఆర్

-

సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ ర్యాడ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50లక్షల ఆర్థిక సాహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని వెల్లడించారు. ఇక నేడు వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం స్వగ్రామానికి రానుంది. మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో పార్థివ దేహాన్ని రీసివ్ చేసుకోనున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం మహేష్ స్వగ్రామం లో అంత్య క్రియలు జరిగే అవకాశం ఉంది. అందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. సైనిక లాంఛనాలతో వీర జవాన్ మహేష్ అంత్య క్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news