ధీరుడు గా రానా.. క్షుద్ర శక్తులతో పోరాటం..?

-

వైవిధ్యమైన చిత్రాలని ఒప్పుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రానా దగ్గుబాటి, తన తర్వాతి చిత్రంలో క్షుద్ర శక్తులతో పోరాడబోతున్నాడట. విరాట పర్వం, అరణ్య సినిమాలు రిలీఝ్ కి రెడీ అవుతున్న ప్రస్తుత సమయంలో తన తర్వాతి చిత్రాన్ని గృహం దర్శకుడు మిలింద్ రావ్ తో ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన గృహం చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన మిలింద్ రావ్, రానాని డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. ఐతే తాజాగా ఈ సినిమా జోనర్ ఏంటనేది బయటకి వచ్చింది. హార్రర్ కథాంశంగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ని ధీరుడు గా నిర్ణయించారని సమాచారం. అలాగే క్షుద్ర శక్తుల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మేరకు అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి రానా నుండి మరో వైవిధ్యమైన సినిమా రాబోతుందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news