కేంద్రం పై ఒత్తిడి పెంచేందుకు ఇందిరా పార్కు లో రేపు మహాధర్నా చేస్తున్నామని.. రేపటి మహాధర్నా లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. అధికారంలో ఉన్న …ప్రతి పక్షంలో ఉన్న టిఆర్ఎస్ ప్రజల వైపే ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన చేస్తున్నామని… పంజాబ్ లో ధాన్యం కొనుగోలు చేస్తారు…తెలంగాణ లో ఎందుకు కొనరు ? అని నిలదీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకొంటుందని ఫైర్ అయ్యారు.
ఒక్కో రాష్టానికి ఒక విధానం ఉండకూడదని చురకలు అంటించారు. కేంద్రం ఇప్పటికీ అయినా కళ్ళు తెరవాలి…ప్రజాస్వామ్యయుతముగా నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు. టిఆర్ఎస్ రైతు పక్షపతి… రైతుల పక్షాన ఈ మహాధర్నా చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని…కొత్తగా ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందని ఫైర్ అయ్యారు.