మందుబాబులకు కేసీఆర్‌ శుభవార్త..డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌

-

తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉండేలా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మద్యం షాపులతో సహ, ఈవెంట్లు, బార్లు, రెస్టారెంట్లకు డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు ఓపెన్‌ చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు నూతన సంవత్సరం ఉత్తర్వులను జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌. డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది తెలంగాణ సర్కార్‌. ఏదీ ఏమైనా.. అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం. కాగా.. ఏపీ లో కూడా డిసెంబర్‌ 31 వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news