‘ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి’ చేప‌ట్టిన భార‌త్.. ఆఫ్ఘ‌న్ నుంచి మ‌రో 78 మంది త‌ర‌లింపు..

-

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో… పరిస్థితులు దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారతీయులను తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం… అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయుల ను స్వదేశానికి తరలించే ఆపరేషన్ కు ” దేవి శక్తి ” గా నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆపరేషన్ దేవి శక్తి చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుందని… ఇందులో భాగం గానే తాజాగా కాబూల్ నుంచి 78 మంది భారతీయులు ఇండియాకు వచ్చారని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అలాగే ఈ ప్రక్రియ లో అలు పెరుగని సేవలందిస్తున్న భారత వాయుసేనకు, ఎయిర్ ఇండియా కు, అలాగే విదేశాంగ శాఖ సిబ్బందికి మంత్రి జయశంకర్ సెల్యూట్ చేశారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు అన్యాయంగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశం లో ప్రజలు అనేక బాధలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version