హిమన్షు దీపం ఛాలెంజ్‌.. అప్పటివరకు దీపాలు వెలిగిస్తా.. కేసీఆర్‌ మనవడు హిమన్షు

-

కరోనా పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్‌ లైట్లు ఆపి.. దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేషమైన స్పందన వచ్చింది. ప్రధాని ఇచ్చిన స్ఫూర్తితో కరోనా అంతం కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు హిమాన్షు దీప ప్రజ్వలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ప్రతి రోజు ఎదో ఒక పేరుతో దీపాలు వెలిగించనున్నట్టు తెలిపారు. దీన్ని ఒక ఛాలెంజ్‌లా స్వీకరించి మరిన్ని ట్వీట్స్‌ చేస్తారాని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

తొలి రోజు ఆదివారం కిల్‌ కరోనా అని, రెండో రోజు సోమవారం విన్‌ కరోనా అని రాసి ఉన్న అక్షరాలపై హిమన్షు దీపాలను వెలిగించారు. దేశంలో కరోనా అంతం కావాలంటూ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కష్టకాలంలో మన దేశం కోసం అందరం ఒక్కటిగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు తాము కూడా హిమన్షుకు మద్దతుగా దీపాలను వెలిగించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో కొన్నింటిని హిమన్షు రీట్వీట్‌ కూడా చేస్తున్నారు.

మద్దతు తెలిపిన సందీప్‌ కిషన్‌..
హిమన్షు చేపట్టిన దీప ప్రజల్వన కార్యక్రమానికి హీరో సందీప్‌ కిషన్‌ మద్దతు తెలిపారు. తను హిమన్షుకు మద్దతుగా దీపం వెలిగించానని చెప్పిన సందీప్‌ కిషన్‌ చేతిలో దీపం పట్టుకుని ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. హిమన్షు ఇలాంటి మంచి కార్యక్రమంగా చేపట్టడం బాగుందన్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 364కు చేరింది. అందులో ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జి అయినట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news