భారత్ కు భారీ సాయాన్ని అందించిన చైనా…

-

అవును నిజమే…ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటించిన చైనా ఇప్పుడు భారత్ కు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. కరోనా వైరస్ తో పోరాడేందుకు చైనా సుమారు 1,70,000 పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్) లను భారత్ కు పంపించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.అంతే కాకుండా మరో 20,000 పీపీఈలను కూడా త్వరలోనే అందిస్తామని పేర్కొంది. మొత్తం కలిపి 1,90,000 పీపీఈ కిట్లను భారత్ లోని ఆసుపత్రులకు, ఆరోగ్య శాఖకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే భారత్ లో 3,87,000 పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నట్లు కూడా తెలిపింది…

కరోనాపై నిరంతరంగా పోరాటం చేస్తున్న దేశంలోని వైద్య సిబ్బందికి ఈ పీపీఈ కిట్లు ఎంతగానో సహకరిస్తాయని ఆరోగ్యశాఖ తెలిపింది.వీటితో పాటు ఇళ్ళలో తయారు చేసిన ఎన్ 95 మాస్కులను కూడా పలు ఆసుపత్రులకు పంపిణీ చేస్తామని, ఇప్పటికే 1.6 బిలియన్ల మాస్కులు అందుబాటులో ఉన్నాయని కూడా పేర్కొంది.

అయితే దేశంలో కరోనా ఎక్కువగా విజృంభిస్తున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వీటిని పంపిణీ చేస్తామని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలుగా సుమారు 8 మిలియన్ల పీపీఈ కిట్ల కోసం సింగపూర్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చామని, మరో 6 మిలియన్ల పీపీఈ కిట్లను చైనాకు ఆర్డర్ ఇచ్చేందుకు చర్చలు జరుపుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news