తెలంగాణ ఎన్నికల్లో మా..పార్టీని గెలిపించాలి అంటే.. మా పార్టీని గెలిపించాలి అని అన్ని పార్టీలు ప్రచారం చేస్తోన్న తరుణంలో.. పార్టీలకు భిన్నంగా కేసీఆర్ ప్రచారం చేశారు. మధిర సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు వల్ల గెలిచేది తెరాస పార్టీ కాదు… ప్రజలు అంటూ తెలిపారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, నేతలు కాదని, అంతిమంగా గెలవాల్సింది తమకు ఓటేసి గెలిపించిన ప్రజలు అని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంత మంది జాతీయ స్థాయి నాకులు పొద్దు పోక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పస లేని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కాంగ్రెస్ ఏజెంట్ అని మోదీ అంటున్నారు. కానీ నేను ఏ పార్టీకో, నేతలకో ఏజెంట్‌ను కాదు. నేను కేవలం ప్రజలకు మాత్రమే ఏజెంట్‌ను అంటూ.. తన దైన శైలిలో ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు.
దేశంలో ప్రతి ఏడాది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే నీటిని ప్రాజెక్టులు కట్టి రైతులకు అందిస్తే ఆత్మహత్యలు ఆగుతాయి. నాలుగేళ్లకిందట కరెంట్ లేక ఇబ్బంది పడ్డాం. కానీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందన్నారు. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అన్నదాతల ఆత్మహత్యలకు అడ్డుకట్టవేశాం. ఏడో తరీఖున మీరు వేసే ఓటు పార్టీల భవిత్వం కంటే కూడా ప్రజల భవిష్యత్ ని నిర్ణయింస్తుందన్నారు.