రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్: బీజేపీ ఎంపీ

-

తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే ప్రధాన లక్ష్యంగా BRS, కాంగ్రెస్ మరియు బీజేపీ లు ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ రోజు జరిగిన ప్రచార కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశాడు. కేసియట్ ప్రత్యేక తెలంగాణ కోసం పది సంవత్సరాలు పోరాడాడు, కానీ అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నా తెలంగాణ కోసం వ్యతిరేకంగా పని చేశాడు అంటూ ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు కోసం సంచులు మోసుకుంటూ వెళ్లిన రేవంత్ రెడ్డి, పార్టీ మారినా చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు అరవింద్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని టీడీపీ చేతిలో పెట్టినట్లే అంటూ అరవింద్ సంచలన కామెంట్స్ చేశాడు.

ఇక ఎన్నికలకు ఉన్నా నాలుగు రోజుల కాలంలో ప్రజల ఆశీర్వారాదాన్ని ఎవరు పొందనున్నారు అన్నది తెలియాల్సి ఉంది. కానీ సర్వేలు మరియు రాజకీయ ప్రముఖుల అభిప్రాయం ప్రకారం చూస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version