ముందస్తు ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలో మంత్రులకు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. అంతర్గతంగా తాను చేయించిన సర్వేల్లో వచ్చిన ఫలితాలను, ప్రజాస్పందనను కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్యెల్సీ ల గురించి మంత్రులకు ఆయన వివరించారు. ఇందులో భాగంగా పార్టీకి ఇబ్బందిగా ఉన్న డీఎస్ (డి. శ్రీనివాస్) పై తీసుకోబోయే చర్యలను వారికి వివరించినట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అవసరమా? ఒక వేళ వెళ్తే పరిస్థితి ఎలా ఉంటోంది? అనే విషయాలపై ఆయన ఒక్కొక్కరి అభిప్రాయాన్ని విన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినే గెలిచే అవకాశం ఉన్న మనం ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని మెజార్టీ మంత్రులు కేసీఆర్ కి తెలిపారు. ముందస్తు గురించి అధికారికంగా తాము ఎక్కడా చెప్పలేదని అయిన ఈ సారి కూడా తెరాస ఘనవిజయం సాధిస్తుందని ఆయన మంత్రులకు చెప్పారు. ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలను, నాయకులను ఎన్నికలను సిద్దంమయ్యేలా ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు.
సెప్టెంబర్ 2న జరిగే ఈ సభకు దాదాపు 25 లక్షల మందిని సమీకరించాలని కేసీఆర్ మంత్రులకు సూచించారు. సభకు అన్ని ఏర్పాట్లను చేయాలని, సభ నిర్వాహణకు కమిటీలను ప్రకటిస్తామని చెప్పారు. సభావేదిక, బారికేడ్, పార్కింగు, నీళ్ల సదుపాయాలను చూసుకోవాలని వారిని ఆదేశించారు.