కేసీఆర్ న్యూ స్ట్రాటజీ…ఆ మంత్రుల పని అదే!

-

హుజరాబాద్ లో ప్రతి అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకెళ్లడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహాలు పన్నుతున్నట్లు కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు అనేక రకాలుగా హుజురాబాద్ లో కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ ఈటల రాజేందర్‌ని ఓడించాలని టిఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంకా ఉప ఎన్నిక షెడ్యూల్ రాకపోయినా సరే మొదటి నుంచి టిఆర్ఎస్‌కు చెందిన బడా బడా నేతలంతా హుజరాబాద్ లో మకాం వేసి, కేసీఆర్ వ్యూహలు అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు.

cm kcr | సీఎం కేసీఆర్

ఇప్పటికే పలురకాలుగా ప్రజలపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్, ఆ వరాలని ఓట్లుగా మార్చుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. హుజరాబాద్ లో దాదాపు రెండు లక్షల 25 వేల ఓట్లు ఉన్నాయి. అయితే ఇందులో సుమారు లక్ష మంది వరకు ప్రభుత్వ పథకాలు అందినట్లు తెలుస్తోంది. ఇలా ప్రభుత్వ పథకాలు అందిన వారు ఓట్లు టిఆర్ఎస్‌కి పడేలాగా, కెసిఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు.

ప్రతి ఒక్కరికి ఏ పథకం వచ్చింది..ఆ పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందారనే ప్రతి విషయాన్ని వివరించి కేసీఆర్ లేఖలు రాయనున్నారు. ఈ లేఖల్ని పథకాలు అందిన ప్రతి ఓటరుకు చేరేలాగా, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు కృషి చేయనున్నారు. వీరు మొదటి నుంచి హుజురాబాద్‌లో మకాం వేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు త్వరగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సీఎం కేసీఆర్ రాసే లేఖలని ఆ లక్షమందికి చేరేలాగా ఇద్దరు మంత్రులు ప్లాన్ చేశారు. వారి ఓట్లు టీఆర్ఎస్‌కు పడేలాగా వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఈ లేఖల రాజకీయం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version